‘అమ్మ‌మ్మ‌..’ శౌర్య‌ను రీఛార్జ్ చేస్తుందా?

Sunday, May 13th, 2018, 07:55:10 PM IST


న‌వ‌త‌రం హీరో నాగ‌శౌర్య కీల‌క‌మైన స‌మ‌యంలో `ఛ‌లో` చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా అత‌డి కెరీర్‌కి బూస్ట్ ఇచ్చింద‌నే చెప్పాలి. ఆ త‌ర‌వాత లైకా సంస్థ నిర్మించిన‌ `క‌ణం` పేరు తెచ్చినా, డ‌బ్బు తేలేద‌ని ట్రేడ్‌లో టాక్ న‌డిచింది. ఆక్ర‌మంలోనే మ‌రోసారి శౌర్య‌కు రీఛార్జ్ చేసే సినిమా ప‌డాల్సిన స‌న్నివేశ‌మిది. స‌రిగ్గా ఇలాంటి టైమ్‌లో అత‌డు న‌టించిన `అమ్మ‌మ్మ‌గారి ఇల్లు` రిలీజ్‌కి వ‌స్తోంది. ఈనెల 25న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే నిర్మాణానంత‌ర ప‌నులు జోరుగా సాగుతున్నాయి. ఇదివ‌ర‌కూ రిలీజైన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు సినిమాపై అంచ‌నాలు పెంచాయి. శౌర్య మ‌రోసారి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌బోతున్నాడ‌న్న‌ పాజిటివ్ టాక్ ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తోంది.

ఈ సినిమాతో మ‌రోసారి షామిలి క‌థానాయిక‌గా తెలుగులోగిళ్ల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రానికి ర‌సూల్ ఎల్లోర్ సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నుంది. స్వాజిత్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. “కాలం మారింది. పాత‌రోజుల్లో కుటుంబ వ్య‌వ‌స్థ ఉండేది. ఇప్పుడు ఇండివిడ్యువ‌ల్ ఫ్యామిలీ వ్య‌వ‌స్థ న‌డుస్తోంది. ఈ స‌న్నివేశంలో మ‌రోసారి పాత‌రోజుల్లోని ఆహ్లాదక‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ప్ర‌జ‌లు జీవించాల‌న్న అండ‌ర్ క‌రెంట్ మెసేజ్‌ని ఇస్తూ, చ‌క్క‌ని క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల‌తో ఈ చిత్రాన్ని రూపొందించామ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చారంలో చెప్పారు. అమ్మ‌మ్మగారి ఇంట్లో ఉండ‌గా ఎన్ని క‌ల‌త‌లు ఉన్నా అవ‌న్నీ దూరంగా ఉంచాల్సిందే. నాటి కుటుంబ వ్య‌వ‌స్థ‌లో ఎంత హుందాత‌నం, ఆహ్లాదం ఉంటుందో తెర‌పై ఆవిష్క‌రించామ‌ని తెలిపారు. ఎలానూ రిలీజ్ ముంగిట ఉంది కాబ‌ట్టి అమ్మ‌మ్మ గారి టీమ్ ప్ర‌మోష‌న్‌లో వేగం పెంచేందుకు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments