`అమ్మ‌మ్మగారిల్లు` 3డి సెట్ మైండ్ బ్లో

Thursday, May 24th, 2018, 12:28:20 AM IST


నాగ‌శౌర్య – షామిలి జంట‌గా న‌టించిన `అమ్మ‌మ్మ‌గారిల్లు` ఈ నెల 25న ఘ‌నంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌కుడిగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మవుతున్నాడు. స్వాజిత్ మూవీస్ పతాకం ఫై శ్రీమతి స్వప్న సమర్పణలో రాజేష్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేటి సాయంత్రం హైద‌రాబాద్ పార్క్‌హ‌య‌త్‌లో జ‌రిగింది.

ఈ ఈవెంట్‌లో నాగ‌శౌర్య‌, షామిలీ జంట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. అంత‌కుమించి ఈ ఈవెంట్ కోసం వేసిన ఖ‌రీదైన అమ్మ‌మ్మ ఇంటి సెట్ మైమ‌రిపించింది. ప్రత్యేకించి ఈ సెట్‌ని 3డిలో డిజైన్ చేసిన విధానం ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. ఓవైపు ఈవెంట్ జ‌రుగుతుంటే .. అక్క‌డ గెస్టుల్ని చూడ‌డం కంటే ఈ సెట్ ఎంత బావుందో అంటూ అంద‌రూ తెగ ముచ్చ‌టించుకున్నారు. అమ్మ‌మ్మ‌గారిల్లు.. ఆ ఇంటి ద్వార‌బంధం, కాస్త బ‌య‌టికి వ‌స్తే ద్వార‌బంధానికి అటు ఇటూ అర‌టిచెట్లు అచ్చం ఇంట్లోకి వెళ్లి వ‌చ్చిన‌ట్టే ఆ 3డి సెట్ ఇమేజ్ ఎంత‌గానో క‌ట్టిప‌డేసింది. ఒక సిల్వ‌ర్ స్క్రీన్ సైజ్‌లో ఈ సెట్‌ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు భారీగానే ఖ‌ర్చు పెట్టి ఉంటార‌ని అర్థ‌మైంది. ఇక అమ్మ‌మ్మ‌గారిల్లు చిత్రం ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. సెన్సార్ క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చి ప్ర‌శంసించింది. సినిమా ఆద్యంతం ఎమోష‌న‌ల్ కంటెంట్ ఆక‌ట్టుకోనుంద‌ని సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంసించారుట‌.

  •  
  •  
  •  
  •  

Comments