62 ఏళ్లుగా స్నానం చేయడం లేదు..అయినా ఆరోగ్యంగానే..!

Sunday, February 19th, 2017, 06:48:08 PM IST


అతడు ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరుగాంచాడు. ఇరాన్ కు చెందిన అమౌ హాజీ(82) అనే వ్యక్తి గత 62 ఏళ్లుగా స్నానం చేయడం లేదు. అయినా అతడు 82 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. ఒక్క స్నానం విషయంలోనే కాదు మిగతా విషయాల్లోకూడా అతడు పరిశుభ్రత అస్సలు పాటించడు. తనకు 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఏదో అనారోగ్యం సోకిందని దానికి కారణం ఆరోగ్యంగా ఉండడమే అని గ్రహించి స్నానం చేయడం మానేశాడని అతడు చెబుతున్నాడు.

తన జుట్టుని మంటతోనే కట్ చేసుకుంటానని చెబుతున్నాడు. ఇతడి ఆహార అలవాట్లుకూడా ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి.కుళ్ళిన అడవి పంది మాంసాన్ని ఇష్టంగా తింటాడట. కానీ రోజుకు 5 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగుతాడట. అత్యంత మురికిగా ఉంటూ కనీస ఆరోగ్య అలవాట్లు కూడా పాటించిన హాజీ ఇంత ఆరోగ్యంగా ఉండడంపై అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్మశానం, ఖాళి భవనాలు వంటి ప్రదేశాల్లో నిద్రిస్తాడు. అతడు ఎవరికి హాని చేయదు కాబట్టి స్థానికులు అతడిని ద్వేషించరు.