ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఆమ్రపాలి దుబే హాట్ డ్యాన్స్!

Wednesday, July 11th, 2018, 07:06:28 PM IST


ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా కొన్ని పాటలు మంచి క్రేజ్ అందుకుంటున్నాయి. ఆ విధంగానే ప్రస్తుతం భోజ్ పూరికి చెందిన ఓ స్పెషల్ సాంగ్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమ్రపాలి దుబే ‘బెల్లి డ్యాన్స్‌’ వీడియో కుర్రకారును ఎక్కువగా ఆకట్టుకుంటోంది. లవ్‌ కే లియే కుచ్‌ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్‌ అనే ఆ పాటలో ఆ బ్యూటీ వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 9న యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ కి 83 లక్షల వ్యూవ్స్ రావడంతో మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీకి నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సాంగ్ తో సౌత్ జనాలను కూడా ఆమ్రపాలి ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments