మ‌హేష్ హీరోయిన్ .. బాల్ థాక్రే వైఫ్‌గా!?

Saturday, September 15th, 2018, 10:52:30 PM IST

మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన అధ్య‌క్షుడు, బాబా సాహెబ్ బాల్ థాక్రేపై బాలీవుడ్‌లో బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. థాక్రే పాత్ర‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖి న‌టిస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కుడు థాక్రేగా అభిన‌యించే ముందు న‌వాజుద్దీన్ చాలానే క‌స‌ర‌త్తుతో ప్రిపేర‌య్యాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. సంజ‌య్ రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ చిత్రంలో అమృత‌రావు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఆ పాత్ర ఏంటి? అన్న‌ది తాజాగా రివీల్ చేశారు. థాక్రే భార్య మీనాథాయ్ పాత్ర‌లో అమృతారావు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ పాత్ర‌పై చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని, అమృత‌రావు చూడ‌టానికి అచ్చం థాక్రే భార్యామ‌ణి మీనాథాయ్ లానే ఉంటారు కాబ‌ట్టే ఎంపిక చేసుకున్నామ‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. జ‌న‌వ‌రి 23న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన టీజ‌ర్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌నున్నామ‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు. అమృత‌రావు ఇదివ‌ర‌కూ మ‌హేష్ స‌ర‌స‌న `అతిధి` చిత్రంలో న‌టించింది. సురేంద‌ర్‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెండేళ్ల క్రిత‌మే ఆర్‌జే అన్మోల్‌ని పెళ్లాడి లైఫ్‌లో సెటిలైంది. మ‌ళ్లీ ఇంత‌కాలానికి ఈ అమ్మ‌డు వెండితెర‌పై రీఎంట్రీ ఇవ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments