అమృత‌పై మారుతీరావు సంచ‌ల‌నం!

Thursday, June 13th, 2019, 09:28:02 PM IST

మిర్యాలగూడ‌లో జ‌రిగిన ప‌రువు హ‌త్య దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. త‌న ఒక్క‌గానొక్క కూతురు అమృత‌ కులం త‌క్కువ వాడైన ప్ర‌ణ‌య్‌ని వివాహం చేసుకుంద‌ని ప‌గ పెంచుకున్న మారుతీరావు అత‌న్ని అత్యంత దారుణంగా సుపారీ ఇచ్చి మ‌రీ హ‌త్య చేయించిన విష‌యం తెలిసిందే. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఈ ప‌రువు హ‌త్య దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. దేశ వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో ఈ ప‌రువు హ‌త్య‌పై పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. మారుతీరావుని ఉరితీయాల‌ని కొంద‌రు, న‌మ్మిన తండ్రిని అమృత‌ మోసం చేసింద‌ని, ఆమెకు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని మ‌రి కొంద‌రు భిన్న‌మైన వాద‌న‌లు వినిపించారు.

సంచ‌ల‌నం సృష్టించిన ఈ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందుతుల‌తో పాటు అమృత‌ తండ్రి మారుతీరావుని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా న్యాయ‌స్థానం వారిని వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించాల‌ని సూచించింది. గ‌త కొన్ని నెల‌లుగా వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న మారుతీరావు అత‌ని వ‌ర్గం కొన్ని రోజుల క్రితం బెయిల్ మంజాఊరు కావ‌డంతో బ‌య‌టికి వ‌చ్చారు. ఈ కేసులో బుధ‌వారం పోలీసులు చార్ఝిషీట్‌ను బుధ‌వారం దాఖ‌లు చేశారు. అత్యంత‌ దారుణంగా ప్ర‌ణ‌య్‌ని హ‌త్య చేయించిన మారుతీరావుకు మ‌ర‌ణ శిక్షే స‌రైన‌ద‌ని పోలీసులు వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించి 120 మందిని విచారించిన పోలీసులు ప‌క్కా ఆధారాల‌తో చార్జిషీట్‌ని దాఖ‌లు చేశారు. దీంతో మారుతీరావుకు ఉరి శిక్ష ఖాయ‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. దీంతో త‌న కూతురు అమృత‌కు త‌న ఆస్తిలో చిల్లిగ‌వ్వా ద‌క్క‌కుండా ప్లాన్ చేశార‌ని స్థానిక స‌మాచారం.