బ్లాక్‌లో లేడీ రోబో… ఎందుకో తెలిస్తే షాకే !

Monday, February 19th, 2018, 03:24:09 PM IST

హాలీవుడ్ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా లైంగిక వేదింపుల రాక్ష‌సుల భోగోతం బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి త‌లిసిందే. ఒక్కో సినీఇండ‌స్ట్రీలో డ‌ర్టీపిక్చ‌ర్ ఏ లెవల్లో ఉందో మిటు హ్యాష్ ట్యాగ్ ఉద్య‌మం బ‌య‌ట‌పెట్టింది. మిటు హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్య‌మంలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల్ని వ్య‌క్త‌ప‌ర‌చ‌డంలో క‌థానాయిక‌లు ఎంత‌మాత్రం సందేహించ‌లేదు. త‌మ‌పై జ‌రిగిన ఆకృత్యాల్ని నిర్భీతిగా వెల్ల‌డించి సంచ‌ల‌నాల‌కు తెర తీశారు.అయితే ప్ర‌స్తుతం `టైమ్స్ అప్‌` అనే కొత్త ఉద్య‌మం మొద‌లైంది. దీనిని హాలీవుడ్ క‌థానాయిక‌లు వేడెక్కించే ప‌నిలో ఉన్నారు. ఇదివ‌ర‌కూ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ వేడుక‌లో త‌మ‌కు ఆన్‌సెట్స్ జ‌రిగిన అన్యాయాల్ని, అక్క‌డ కామాంధుల గురించి ఓపెన్‌గా చెప్పుకుని తార‌లు ఆవేద‌న చెందారు.

అయితే ఆ ఉద్య‌మం అక్క‌డితో ఆగిపోలేదు. ప్ర‌స్తుతం బాఫ్టా 2018 అవార్డుల కార్య‌క్ర‌మంలోనూ న‌ల్ల డ్రెస్ ధ‌రించిన తార‌లు వేదింపులకు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపారు. ఇలాంటివి మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా ఉండాల‌ని స‌ద‌రు క‌థానాయిక‌లు చేతులు క‌లిపి ఉద్య‌మరూపాన్ని తీసుకొస్తున్నారు. ఏంజెలినా జోలీ, మార్గ‌రెట్ రోబీ వంటి తార‌లు బాఫ్టా అవార్డుల‌ కార్య‌క్ర‌మంలో నిర‌స‌న‌లు తెలియ‌జేశారు. వారికి బాస‌ట‌గా లండ‌న్ బ్యూటీ ఎమీజాక్స‌న్ న‌ల్ల డ్రెస్ ధ‌రించి ర్యాంప్ వాక్ చేసింది. ఎమీజాక్సన్ ప్ర‌స్తుతం 2.ఓ చిత్రంలో రోబోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ఓ చిత్రంలో అవ‌కాశం అందుకుంది. 2.ఓ చిత్రంలో ఎమీ పాత్ర ఎలా ఉంటుందో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంది.