కొత్త గెట‌ప్‌లో షాకిచ్చిన ఎమీజాక్స‌న్

Tuesday, July 24th, 2018, 09:14:54 PM IST

లండ‌న్ నుంచి వ‌చ్చి భారతీయ సినీప‌రిశ్ర‌మ‌ను ఏల్తోంది ఎమీజాక్స‌న్‌. ఉత్త‌రాది, దక్షిణాది అనే తేడాలేకుండా అన్నిచోట్లా త‌న‌దైన హ‌వా సాగిస్తోంది. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ 2.ఓ రిలీజ్‌కి రెడీ అవుతోంది. నవంబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్‌ ఫిక్స్ చేయ‌డంతో అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఈలోగానే ఎమీజాక్స‌న్ న‌టించిన వేరొక సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ఎమీ క‌న్న‌డ రంగంలో ప్ర‌వేశిస్తూ న‌టించిన తొలి సినిమా `విల‌న్‌` ఆగ‌స్టులో రిలీజ్‌కి సిద్ధ‌మవుతోంది. ఈ మూవీ కోసం 70రోజుల పాటు చిత్రీక‌ర‌ణ సాగించారు. షూటింగ్ పూర్త‌యింది. ఈ సినిమాలో శివ‌రాజ్‌కుమార్, కిచ్చా సుదీప్ క‌థానాయ‌కులుగా న‌టించారు. తాజాగా ఓ ప్ర‌త్యేక గీతాన్ని చిత్రీక‌రించారు. అనంత‌రం ద‌ర్శ‌కుడు ప్రేమ్‌తో క‌లిసి ఎమీ ఇలా ఫోజివ్వ‌డ‌మే గాకుండా స్వీట్ హార్ట్ అంటూ పొగిడేసింది. రొటీన్ బికినీ గాళ్ ఇలా కొత్త‌గా కాట‌న్ చీర‌లో వేడి పెంచ‌డం నెటిజ‌నుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments