సల్మాన్ కు కిక్ ఇస్తానంటున్న హాట్ భామ?

Tuesday, February 13th, 2018, 02:40:40 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా టైగర్ జిందా హై సినిమాతో మంచి విజయాన్ని అందుకుని అటు బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. తాజాగా అయన నెక్స్ట్ సినిమాకోసం సిద్ధం అవుతున్నాడు. ఇదివరకే తెలుగులో సూపర్ హిట్ అయినా కిక్ సినిమాను హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు సల్మాన్ ఖాన్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కిక్ 2 గా తెరకెక్కే ఈ చిత్రంలో హాట్ భామ అమీ జాక్సన్ నటిస్తుందట. ఇప్పటికే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. అమీ తో పాటు జాక్వలిన్ కూడా నటిస్తుందట. అమీ జాక్సన్ ప్రస్తుతం రజనీకాంత్ సరసన 2. 0 లో నటించిన అమీ మొత్తానికి బాలీవుడ్ లో మరో క్రేజీ ఛాన్స్ పట్టేసింది.