ఏపీ ప్రభుత్వంపై సంచలన వాఖ్యలు చేసిన పారిశ్రామికవేత్త

Saturday, August 17th, 2019, 03:00:14 AM IST

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక బడా పారిశ్రామికవేత్త మోహన్‌ దాస్‌ పాయ్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కొన్ని సంచలనమైం వాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, అక్షయపాత్ర సహవ్యవస్థాపకుడు, ఆర్యన్‌ క్యాపిటల్‌ అధినేతపలు కంపెనీల్లో సహాధికారిగా ఉన్నటువంటి మోహన్‌దాస్‌ పాయ్‌ ఇండిపెండెంట్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ప్రస్తావించడం అనేది చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. కాగా జగన్ ప్రభుత్వం పీపీఏలపై సమీక్ష జరపడంపై మోహన్‌దాస్‌ పాయ్‌ తీవ్రమైన అభ్యన్తరం వ్యక్తం చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతుందని ఆయన సామాజిక మాంద్యమాల ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఏపీ భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అయితే ఈయన చేసిన ఆ ట్వీట్ ని సరాసరిగా జగన్మోహన్ రెడ్డికి టాగ్ చేశారు. మీరు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఏపీకి ఎలా కొత్త పరిశ్రమలు వస్తాయని ఆయన ప్రశ్నించారు. కాగా సింగపూర్‌ ఇప్పటికే అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిందని, కానీ వారి నమ్మకాన్ని పోగొట్టే విధంగానే జగన్ వ్యవహరిస్తున్నారని ఆ పారిశ్రామికవేత్త సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే వైసీపీ పార్టీ అధినేత కానీ, వైసీపీ నేతలు కానీ ఎవరు కూడా ఈ ట్వీట్ పై ఎలాంటి స్పందనలు తెలపకపోవడం పలు ఆచర్చలకు దారితీస్తుంది. అయితే ఈ ట్వీటీపై ఏపీ ప్రతిపక్ష పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి…