అరవింద సమెత సాంగ్: అటు చూస్తే కుర్రాళ్లు .. అసలేమైపోతారు?

Saturday, September 15th, 2018, 05:15:35 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత. మొదటి సారి కలిసి పనిచేస్తోన్న ఈ కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రిలీజైన్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పుడు మరింత హైప్ క్రియేట్ చేసింది. సినిమాకు సంబదించిన మొదటి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

మెలోడీగా గా సాగే ఈ పాట లిరిక్స్ ను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించారు. ‘అనగనగనగా అరవిందట తన పేరు .. అందానికి సొంతూరు .. అందుకనే ఆ పొగరు, అరెరెరెరే .. అటు చూస్తే కుర్రాళ్లు .. అసలేమైపోతారు .. అన్యాయం కదా ఇది అనరే ఎవరూ ..’ అంటూ అర్మాన్ మాలిక్ పాడిన విధానం థమన్ సంగీతం చక్కగా కుదిరాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇక గత సినిమాతో నిరాశపరిచిన త్రివిక్రమ్ ఈ సినిమాతో తప్పకుండా ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్టు మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments