నేటినుండి ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు ఇంటింటికి పంపిణీ

Tuesday, June 8th, 2021, 09:45:26 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కి ఆనందయ్య మందు పంపిణీ నేటి నుండి ఇంటింటికి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మందు పంపిణీ కార్యక్రమం ను ప్రారంభించారు. సర్వేపల్లి నియోజక వర్గం లో నేడు ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. అయితే నేడు మందు పంపిణీ కార్యక్రమం లో ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి పాల్గొననున్నారు. అయితే కడపలో ఆనందయ్య మందు తయారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్విస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆనందయ్య మందును తయారీ చేయనున్నారు.

అయితే మనుబోలు, పొదలకూరు మండలాల్లో ప్రస్తుతం ఆనందయ్య మందును గ్రామ వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. అయితే మొత్తం లక్షా ఎనభై వేల ఇళ్లకు ఆనందయ్య మందు నేడు చేరనుంది. అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మందును పంపిణీ చేయనున్నట్లు ఆనందయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.