బిగ్ న్యూస్: సీఎం జగన్ కి ఆనందయ్య లేఖ…ఎందుకంటే?

Tuesday, June 8th, 2021, 12:12:59 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కి కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య లేఖ రాశారు. ఆనందయ్య కరోనా వైరస్ మహమ్మారి కి ఔషధం తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఔషధం తయారీ సామాగ్రి మరియు తదితరులకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. అయితే ఎక్కువ మొత్తం లో మందును తయారీ చేసి ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేసే విధంగా సహయ సహకారాలు అందించాలని ఆనందయ్య లేఖలో పేర్కొన్నారు. అయితే మందు తయారీ కి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ను ఏర్పాటు చేయాలని లేఖ లో సూచించారు. అయితే ఈ మందు పంపిణీ గురించి నిన్న ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు తప్ప సహకారం లేదని అన్నారు. అయితే విద్యుత్ సౌకర్యం కూడా సరిగ్గా లేదని తెలిపారు. అయితే వాలంటీర్ల ద్వారా ఈ మందును స్థానికులకు పంపిణీ చేస్తున్నారు. అయితే అక్కడికి చేరుకొనే ఇతర ప్రాంతాల వారిని పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. అంతేకాక ప్రస్తుతం కృష్ణపట్నం లో 144 సెక్షన్ అమలు లో ఉన్న సంగతి తెలిసిందే.