ఆ ఎస్పీ చెప్పిన మాటలకి ఫిదా అయిన చంద్రబాబు

Friday, September 30th, 2016, 03:03:37 PM IST

chandrababu
కలక్టర్ల సమావేశం లో శాంతి భద్రతల విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాల గురించి చర్చించారు. రౌడీ లూ గూండాలూ పెరిగిపోతున్న నేపధ్యంలో క్రైమ్ అనేది లేకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటూ చంద్రబాబు అందరి సలహా కోరగా. అనంతపురం ఎస్పీ రాజశేకర్ బాబు తాము సీసీ టీవీ కెమెరాలతో నేరాలు ఎలా అరికడుతున్నాం అనేది చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన తీరు, ఆలోచనా విధానానికి చంద్రబాబు ముఘ్దుడు అయ్యారు అట. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి చర్యలకి పాల్పడి అన్ని చోట్లా సీసీ టీవీ కెమెరాలు పెట్టాలి అంటే ఎంత బడ్జెట్ అవుతుంది అని అధికారుల దగ్గర ఆరా తీసారు బాబు . ” ఆయన చెప్పిన పద్ధతి అందరూ విన్నారు కదా, అదొక అద్భుతమైన ఆలోచన . ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చునీ సీసీ టీవీ ల కొసం ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎటువంటి పరిస్థితి లో రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిపోవాలి . ఇదే మన ఆశయం ” అని బాబు వారితో అన్నారు. అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి చలాన్ ల రూపం లో వసూలు చేసే డబ్బుని తిరిగి ట్రాఫిక్, సివిల్ పోలీసులకి విధుల నిర్వాహణ లో కవాల్సిన అవసరాల మేరకి కేటాయిస్తాం అని తెలిపారు ఆయన. రాష్ట్రంలో విజిబుల్ పోలీసింగ్ కంటే ఇన్‌విజిబుల్ పోలీసింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీమ ప్రాంతాల్లో ఫ్యాక్షనిజాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని పేర్కొన్న చంద్రబాబు, కేసులు వీగిపోకుండా గట్టి ఆధారాలతో కేసులు నమోదు చేయాలని సూచించారు.