ఫోటో : వీపు చూడు వీపందం చూడు

Sunday, October 7th, 2018, 02:34:47 PM IST

బాలీవుడ్‌లో న‌ట‌వార‌సురాళ్ల వెల్లువ గురించి తెలిసిందే. జాన్వీక‌పూర్, సారా అలీఖాన్ లాంటి నాయిక‌లు స్టార్‌ సెల‌బ్రిటీ కుటుంబాల నుంచి వ‌చ్చిన‌వారే. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా జాన్వీ ఆరంగేట్రం మెప్పించింది. ధ‌డ‌క్ చిత్రంలో జాన్వీ న‌ట‌న‌కు పేరొచ్చింది. ఆ త‌ర్వాత సారా వంతు. ప్ర‌స్తుతం ఈ భామ ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న `సింబా` చిత్రంలో న‌టిస్తోంది. ఆ ఇద్ద‌రి గురించి మీడియాలో విస్త్ర‌త ప్ర‌చారం సాగుతోంది.

ఆ ఇద్ద‌రినీ మించిన మ‌రో అందం బాలీవుడ్‌ని షేక్ చేయ‌డానికి తొంద‌ర్ల‌నే రెడీ అవుతోంది. ఈ న‌ట‌వార‌సురాలి పేరు అన‌న్య పాండే. న‌టుడు చుంకీపాండే కుమార్తె. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2` చిత్రంతో క‌ర‌ణ్ జోహార్ స్వ‌యంగా తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. 0 మే 2019లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆలియా భ‌ట్ డెబ్యూగా న‌టించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్`(2012) సినిమాకి ఇది సీక్వెల్ సినిమా. అన‌న్య కూడా ఆలియా అంత పెద్ద స‌క్సెస్ అందుకుంటుంద‌నే అంచ‌నా వేస్తున్నారంతా. ట్యాలెంటెడ్ పునీత్ మ‌ల్హోత్రా ఈ సీక్వెల్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో రిలీజ్ కానుంది. టైగ‌ర్ ష్రాఫ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. లేటెస్టుగా ప్ర‌ఖ్యాత‌ ఎల్లే బ్యూటీ అవార్డ్స్ 2018 వేడుక‌ల్లో పాల్గొన్న అన‌న్య ఇలా బ్యాక్ చూపించి బెండు తీసింది. కుర్రాళ్ల భ‌విష్యత్ క‌ల‌ల‌రాణి ఈ అమ్మ‌డు అన‌డానికి ఇంత‌కంటే విజువ‌ల్ ఎగ్జాంపుల్ కావాలా?