ఆ విషయంలో అనసూయ అప్సెట్ అయిందట !!

Thursday, February 23rd, 2017, 12:01:45 PM IST


గ్లామర్ యాంకర్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ అనసూయ లేటెస్ట్ గా విన్నర్ సినిమాలో సుయ .. సుయా అంటూ ఓ హాట్ ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సాంగ్ పై మంచి క్రేజ్ ఏర్పడింది. సోగ్గాడే చిన్ని నాయన, క్షణం సినిమాలతో గత ఏడాది మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఈ చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం విశేషం. అయితే ఈ సాంగ్ చేసిన విషయంలో అనసూయ అప్సెట్ అయిందట !! ఎందుకో తెలుసా .. నిజానికి ఈ సాంగ్ కోసం ఆమె 16 లక్షలు డిమాండ్ చేసిందని, దానికి దర్శకనిర్మాతలు కూడా ఓకే చెప్పి పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చారట !! ఆ తరువాత సాంగ్ బాగా వచ్చింది. తన ఇమేజ్ ఈ సినిమాకు మంచి ప్లస్ అయిందంటున్న అనసూయ ఈ సినిమాకోసం మిగతా అమౌంట్ మాత్రం ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదని వాపోయింది. తాను అంత రెమ్యూనరేష అనుకున్నాకే ఓకే అన్నానని, నిర్మాతలు మాత్రం మాట తప్పారని ఫీల్ అవుతుంది పాపం ?