రంగమ్మత్త ఆడిషన్ చూశారా?

Friday, April 27th, 2018, 08:51:44 PM IST


సుకుమర్ దర్శకత్వంలో రామ్ చరణ్ – సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రంగస్థలం సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి అందరికి తెలిసిందే. సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా రంగమ్మత్త క్యారెక్టర్ అయితే కుర్రకారుకు బలే కనెక్ట్ అయ్యింది. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ రామ్ చరణ్ అత్తగా కనిపిస్తోంది అనగానే అందరూ షాక్ అయ్యారు. ఆమె ఆ పాత్రకు వర్కౌట్ అవుతుందా అనే అనుమానం చాలానే వచ్చింది. కానీ ఫైనల్ గా అనసూయ తన పాత్రకు తగిన న్యాయం చేసింది. అయితే ఈ సినిమా కోసం అనసూయ చేత ముందు చిత్ర యూనిట్ ఆడిషన్ చేసింది. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments