ఐటెం సాంగ్ తో దుమ్మురేపనున్న .. హాట్ యాంకర్

Monday, November 14th, 2016, 11:47:29 AM IST

anasuya
ఈ మధ్య టెలివిజన్ రంగంలో యాంకర్ గా హాట్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది అనసూయ. జబర్దస్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు .. అటు సినిమాల్లో కూడా నటిస్తుంది. మరో వైపు అనసూయకు ఐటెం సాంగ్స్ చేయమని తెగ ఆఫర్స్ వస్తున్నాయట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ”అత్తారింటికి దారేది” సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చినా కూడా నో చెప్పింది .. మామకు నో చెప్పి అల్లుడి సినిమాలో ఐటెం సాంగ్ కు ఓకే చెప్పి షాక్ ఇచ్చింది!! ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ”విన్నర్” సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ చేస్తుంది. ఇటీవలే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా జరిపారు. ”… అనసూయ .. అనసూయా” అంటూ సాగె పల్లవి తో ఈ పాట ఉంటుందట !! గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనసూయ సాంగ్ సినిమాకే హైలెట్ అని యూనిట్ భావిస్తుంది. మరి ఈ సాంగ్ తో అనసూయ .. టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం అని అంటున్నాయి సినీ వర్గాలు !!