అన‌సూయ `జాక్‌పాట్` కొట్టేస్తుందంటారా?

Sunday, February 12th, 2017, 11:52:13 AM IST


అందాల యాంక‌ర్ అన‌సూయ బుల్లితెర నుంచి వెండితెర‌కు ట్రాన్స్‌ఫామ్ అవుతోంది. సోగ్గాడే చిన్నినాయ‌నా చిత్రంలో నాగార్జున మ‌ర‌ద‌లిగా ఓ పాట‌లో స్టెప్పులేసి కుర్ర‌కారు గుండెల్ని చిదిమేసింది. ఇద్ద‌రు పిల్ల‌ల ఆంటీ ఈ రేంజులో డ్యాన్సులు చేయ‌డం వారెవ్వా! అన్నారు యూత్‌. ఇప్పుడు ఏకంగా సూయ సూయ అన‌సూయ అంటే త‌న‌పైనే మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌న‌సు పారేసుకుని స్టె్పులేస్తున్నాడు. సాయిధ‌ర‌మ్‌తో క‌లిసి ఐటెమ్ నంబ‌ర్‌లో చిందేస్తోంది అన‌సూయ‌. మ‌రోవైపు జ‌బ‌ర్ధ‌స్త్ ఎలానూ ఉండ‌నే ఉంది. దీంతో పాటే టీవీ9లో సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూల‌తో `ఏ డేట్ విత్ అన‌సూయ‌` పెద్ద స‌క్సెసైంది. అయితే అన‌సూయ రాజ‌సూయం ఇంత‌టితో ఆగిపోలేదు. స్టిల్ కంటిన్యూస్‌… ప్రస్తుతం జెమిని టీవీలో `జాక్‌పాట్‌` అనే కొత్త కార్య‌క్ర‌మంతో ట‌చ్‌లోకొచ్చింది. నేటి సాయంత్రం (ప్ర‌తి ఆదివారం సాయంత్రం) 8.30కు ఈ కార్య‌క్ర‌మం జెమినీలో ప్ర‌సారం కానుంది. ఈ కొత్త ప్రోగ్రామ్‌తోనూ బుల్లితెర వీక్ష‌కుల్లోకి దూసుకుపోతోంది అమ్మ‌డు. ఇవిగో ఆ పోస్ట‌ర్లు..