అనసూయా ఆశలు నిలబెట్టిన రంగమ్మత్త ?

Monday, April 2nd, 2018, 10:54:12 AM IST

గ్లామర్ యాంకర్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ అనసూయ ఆనందం ఇప్పుడు మాటల్లో చెప్పలేం! రంగస్థలంలో ఆమె రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది. సినిమాలో పూర్తిస్థాయి పాత్రలో రంగమ్మతగా అనసూయ నటన సినిమాలో కీలకంగా ఉండడం. ఆ పాత్రలో నిజంగా రంగమ్మత్త అంటే ఇలాగే ఉంటదేమో అనేలా అనసూయ నటించి మెప్పించింది. ఈ సందర్బంగా అనసూయ ఓ సందర్బంగా తన ఫీలింగ్ తెలియచేస్తూ బాహుబలి లో శివగామి పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరెవ్వరిని ఊహించుకోలేం ..

అలాగే రంగస్థలం లో రంగమ్మత్తగా అనసూయను తప్ప ఇంకెవరిని ఊహించలేం అంటూ అభిమానులు అంటున్నారని, తనకు సందేశాలు పంపుతున్నారని తెలిపింది. ఈ ప్రశంశలతో రంగమ్మత్తగా చాలా గర్వాంగా ఉందని చెప్పింది. రంగమ్మత్త పాత్రలో ఒదుగుతనం తనలో ఉందని , అందుకే ఆపాత్ర లో తాను అంతగా ఒదిగిపోయానని చెప్పింది. ఈ సందర్బంగా రామ్ చరణ్ కు సుకుమార్ కు ధన్యవాదాలు తెలిపింది రంగమ్మత్త అలియాస్ .. అనసూయ. ఈ దెబ్బతో అనసూయకు మరిన్ని మంచి అవకాశాలు క్యూ కట్టడం ఖాయం.