జ‌బ‌ర్ధ‌స్త్‌ పిక్‌ : మైండ్ బ్లాక్ అవ్వ‌డం గ్యారెంటీ..

Thursday, March 8th, 2018, 08:57:29 PM IST

జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ అన‌సూయ వ్య‌వహారం ఏదో తేడా కొడుతోంది. ఇటీవ‌లి కాలంలో ఈ మేటి యాంక‌ర్ తీరుతెన్నుల్లో ఏదో ఏదో తెలియ‌ని మ‌త్తు, మ‌హ‌త్తు క‌నిపిస్తున్నాయ్‌. అస‌లు ఇదివ‌ర‌కెన్న‌డూ త‌న‌ని ఈ రేంజులో చూడ‌లేదే అని కుర్ర‌కారు క‌న్ను కుట్టేసుకునే రేంజులో ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో విజువ‌ల్ గ్లింప్స్‌తో మోడ్ర‌న్‌ క‌థానాయిక‌ల‌కే చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

హాట్ కంటెంట్‌.. హీటెక్కించే స్ట‌ఫ్.. ట్విట్ట‌ర్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటే ఇక కుర్ర‌కారులో గిలిగింత‌ల‌కు హ‌ద్దే లేకుండా పోతోంది. మొత్తానికి ఇన్నేళ్లుగా త‌న‌దైన అందం, ఛ‌రిష్మాతో బుల్లితెర‌ను ఏలిన అన‌సూయ ఇక మీద‌ట సినీకెరీర్ ప‌రంగానూ పూర్తి బిజీ అవ్వాల‌ని అనుకుంటోంద‌ని ఈ పోక‌డ చెబుతోంది. గాలి ఎప్పుడు ఏ దిశ‌కు మ‌ర‌లుతుందో ఎవ‌రైనా క‌నిపెట్ట‌గ‌ల‌రా? సునామీని ఎవ‌రైనా ఆప‌గ‌ల‌రా? అలాంట‌ప్పుడు అన‌సూయ‌ను ఆపే ద‌మ్ము ఎవ‌రికుంది?