బీచ్ లో రంగమ్మత్త..!

Saturday, April 28th, 2018, 03:23:22 PM IST

ఒకవైపు టీవీ షోలలో యాంకర్ గా చేస్తూ, మరోవైపు సినిమాలలో నటిగా రాణిస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. ప్రతీ షోలో మరియు సినిమాల్లో ఏంతో హుషారుగా ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న అనసూయ ఇప్పుడు సినిమాలలో చాలా బిజీ అయిపొయింది. స్మాల్ స్క్రీన్ పై పలు రకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే, సిల్వర్ స్క్రీన్ పై ముఖ్య పాత్రలు పోషిస్తుంది. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో, రామ్ చరణ్ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా రంగస్థలం 1985. ఈ చిత్రంలో అతి ముఖ్యమైన పాత్ర చేసిన అనసూయ, రంగ‌మ్మ‌త్తగా ఇచ్చిన పాత్రకి ప్రాణం పోసి అన‌సూయ ఒక మంచి మెమోర‌బుల్ ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించింది. రామ్ చ‌ర‌ణ్‌,స‌మంత‌ల‌కి స‌మానంగా అన‌సూయ పాత్ర‌కి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో అన‌సూయ‌కి మ‌రిన్ని ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. వినోద‌భ‌రిత క‌థాంశంతో అనీల్ రావిపూడి రూపొందించ‌నున్న‌ మల్టీ స్టార‌ర్ ఎఫ్‌2 చిత్రంలోను అన‌సూయని కీల‌క పాత్ర‌కి ఎంపిక చేశార‌ని సినీ వర్గంలో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే మొన్న‌టి వ‌ర‌కు షూటింగ్స్‌తో బిజీగా ఉన్న అన‌సూయ ప్రస్తుతం ఫ్యామిలీతో విహార యాత్ర‌కి వెళ్ళింది. బీచ్ ఒడ్డున త‌న పిల్ల‌లు, భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫోటోస్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ క్షణాలు ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో అని ట్వీట్ చేసిన అన‌సూయ ఆ ప్ర‌దేశం ఎక్క‌డ‌నే విష‌యం మాత్రం చెప్ప‌లేదు. చాలా రోజుల తర్వాత తన పిల్లలు, భర్తతో కలిసి ఒక విహార యాత్రకు వెళ్లి కాస్త విశ్రాంతి తీస్కుంటుంది.