ఆ ఐటెం సాంగ్ కోసం అనసూయ ఎంత తీసుకుందో తెలుసా ?

Wednesday, February 15th, 2017, 11:49:49 AM IST


హాట్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న అనసూయ అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఐటెం సాంగ్స్ కూడా చేస్తున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో హాట్ ఐటెం సాంగ్ చేసింది. సుయా .. సుయా అంటూ సాగే ఈ సాంగ్ లో అనసూయ గ్లామర్ తో రెచ్చగొడుతోందని అంటున్నారు యూనిట్ వర్గాలు. ఈ సాంగ్ చేయడానికి కూడా ప్రత్యేక కారణం ఉందంటున్న ఈ అమ్మడు కథ ప్రకారమే ఈ సాంగ్ వస్తుందని అందుకే ఒప్పుకున్నా అని చెబుతుంది. పైగా ఈ సాంగ్ కోసం ఈ అమ్మడు ఎంత తీసుకుందో తెలుసా .. పదిలక్షలు పైగానే వసూలు చేసిందట !! ఓ హాట్ ఐటెం గర్ల్ కంటే ఎక్కువగానే తీసుకున్న ఈ అమ్మడు ఈ సాంగ్ తరువాత టాలీవుడ్ లో ఐటెం గర్ల్ గా స్పెషల్ క్రేజ్ తెచ్చుకోవడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు సినీ జనాలు !!