ఈమె తాగితే .. మాములుగా ఉండదట !!

Thursday, September 22nd, 2016, 02:33:31 PM IST

anasuya
ఈ మధ్య సినిమా హీరోయిన్స్ కు ధీటుగా టివి యాంకర్స్ కూడా జోరు ప్రదర్శిస్తున్నారు. బుల్లి తెరపై గ్లామర్ లోను తామేమి తక్కువ కాదని నిరూపిస్తూ హాట్ హాట్ అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ కి ధీటుగా ఇమేజ్ తెచ్చుకుంది హాట్ యాంకర్ అనసూయ. ఇప్పుడు అనసూయ క్రేజ్ మాములుగా లేదు, ఈమెకున్న క్రేజ్ చూసి హీరోయిన్స్ సైతం షాక్ అవుతున్నారు? ఓ వైపు సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ భామకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ మధ్య ఐటెం సాంగ్ చేయమని ఛాన్స్ వచ్చినా నో చెప్పింది, ఇక ఇప్పటికే యాంకర్ గా పలు ఆడియో వేడుకలు, సినిమా కార్యక్రమాలు, టివిల షోలు చేస్తున్న ఈ భామ తాజాగా ఓ ఛానల్ లో ‘డేట్ విత్ అనసూయ’ అనే కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమంలో అనసూయ చెప్పిన మాటలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి ? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన అందాల భామ రెజినాతో చిట్ చాట్ లో భాగంగా తాగుడు గురించి మాట్లాడుకుందాం అని అడిగి రెజీనా నువ్వు తాగావా ఎప్పుడైనా అని అడగ్గా .. తాను తన గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడప్పుడు కొద్దిగా తాగుతాను అని చెప్పింది, వెంటనే రెజినా మరి నీ సంగతి ఏమిటి అనసూయ అని అడగ్గానే .. నేను కూడా అప్పుడప్పుడు తాగుతాను, కానీ నేను తాగితే బలయ్యేది మాత్రం .. తన భర్త అంటూ చెప్పింది. ఈ మాటలు విన్నవాళ్ళందరూ షాక్ అవుతున్నారు ? అంటే అనసూయ తాగితే మాములుగా ఉండదేమో అని !!