అన‌సూయ ఎమోష‌న్ అయిన వేళ‌!

Monday, September 25th, 2017, 10:46:19 AM IST

అన‌సూయ భ‌ర‌ద్వాజ్ … ద‌శాబ్ధ కాలంగా తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్న మేటి యాంక‌ర్‌. యువ‌త‌రం గుండె ల‌య‌.. అంటే త‌ప్పేం కాదు. జ‌బ‌ర్ధ‌స్త్ అన‌సూయ‌గా బుల్లితెర‌కు గ్లామ‌ర్ తెచ్చిన అన‌సూయ .. ఐటెమ్ నంబ‌ర్ల‌లో సూయ సూయ అనేంత‌గా ఎదిగింది. త‌న పేరు మీదే లిరిక్ రాసేంత‌గా ర‌చ‌యిత‌ల్ని ఇన్‌స్ప‌యిర్ చేసిందంటే అన‌సూయ‌లో ఉన్న మ‌హ‌త్తు అలాంటిది. ప్ర‌తిభ‌, తెలివితేట‌లు పుష్క‌లంగా ఉన్న హుషారైన యాంక‌ర్‌గా.. హుషారెత్తించే హోస్ట్‌గా త‌న‌ని తాను నిల‌బెట్టుకున్న తీరు అన‌న్య సామాన్యం. గంట‌ల్లో యాంక‌రింగుకి, ల‌క్ష‌ల్లో పారితోషికం అందుకుంటున్న యంగ్ అండ్ డైన‌మిక్ యాంక‌ర్‌గా అన‌సూయ వెలుగులు విర‌జిమ్ముతోంది.

ఇటీవ‌లి కాలంలో వెండితెర‌పైనా రాణించే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉంది. సోగ్గాడే చిన్నినాయ‌నా చిత్రంలో ఓ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన అన‌సూయ అటుపై సాయిధ‌ర‌మ్ సినిమాలో ఐటెమ్ నంబ‌ర్‌తో మైమ‌రిపించింది. ప్ర‌స్తుతం లీడ్ నాయిక‌గా అవ‌కాశం అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఒడిదుడుకుల రంగంలో ఎద‌గ‌డం అంటే అంత వీజీ కాదు. అయినా త‌న‌ని తాను ఈ స్థాయిలో నిల‌బెట్టుకుంది అంటే ఆ వెన‌క ఓ బ‌లీయ‌మైన శ‌క్తి ఉంద‌ని భావించాలి. ఇదే ప్ర‌శ్నకు అన‌సూయ చెప్పిన ఏకైక స‌మాధానం.. `అమ్మ‌`. లైఫ్‌లో ప్ర‌తిదీ అమ్మ‌. త‌న‌వ‌ల్ల‌నే ఇదంతా.. న‌న్ను ఈ స్థాయికి తీర్చిదిద్దిన అమ్మ‌కు ధ‌న్య‌వాదాలు. అత్యుత్త‌మ క్ర‌మ‌శిక్ష‌ణ‌, బ‌ల‌మైన వ్య‌క్తిత్వం న‌న్ను ఎదిగేలా చేశాయంటూ విన‌మ్రంగా చెబుతోంది అన‌సూయ‌. త‌న మాతృమూర్తి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో త‌ల్లితో ఉన్న‌ప్ప‌టి ఫోటో షేర్ చేసుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు అన‌సూయ‌.

  •  
  •  
  •  
  •  

Comments