రోడ్డు ప్రమాదంలో యాంకర్ కు గాయాలు!

Monday, May 21st, 2018, 03:09:16 PM IST

ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిత్యం ఎక్కడో ఒక చోట కొందరు ఈ ప్రమాదాల బారినపడుతున్నారు. ఇక నేడు ఒక తెలుగు ఛానల్ లో టీవీ యాంకర్ గా పని చేస్తున్న లోబో (మొహమ్మద్ ఖయీమ్) రోడ్ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే నేటి ఉదయం వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు, రామప్ప, వేయి స్తంభాల గుడి ప్రాంతాల్లో లోబో తోపాటు అతని బృందం ఒక కార్యక్రమం షూటింగ్ పూర్తి చేసుకుని జనగామ జిల్లా, రఘునాధపల్లి మండలం, నెడిగొండ జాతీయ రహదారి వద్దకు చేరుకోగానే, వారు ప్రయాణిస్తున్న కారుని అటు నుండి వేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో పెను ప్రమాద చోటుచేసుకుంది.

అయితే ఈ ప్రమాదంలో కార్ అద్దాలు ధ్వంశం అయి అందులో వున్న లోబోకు, అలానే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ వంశి ప్రియకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఆటో మాత్రం చాలా వరకు నుజ్జు నుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే వారిని జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో నలుగురికి మరింత తీవ్ర గాయాలయ్యని సమాచారం. విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments