యాంకర్ లాస్య కు నిశ్చితార్ధం….?

Monday, January 30th, 2017, 11:35:37 AM IST

lasya
బుల్లితెర వీక్షకులకు లాస్య అనే పేరు వింటే వెంటనే వారి పెదవులపై నవ్వు వస్తుంది. తన నవ్వుతో చాలామందిని తన అభిమానులుగా మార్చుకుంది లాస్య. బుల్లితెరపై యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆమె టీవీ షోలతో పాటు ఆడియో ఫంక్షన్లతో చాలా బిజీ గా ఉంది. అంతేకాదు ఆమె సినిమాలలో నటించడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో నటిస్తున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించింది.

అదే కాకుండా లాస్య ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా చెప్పింది. ఇప్పుడు తన కెరీర్ ఎంతో బిజీగా ఉంది. ఇలాంటి సమయంలోనే ఆమె తన నిశ్చితార్ధం గురించి ప్రకటన చేసింది. ‘ఒక ప్రత్యేకమైన రోజు కోసం రెడీ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా సోల్ మేట్ తో నిశ్చతార్ధం జరుగుతుంది. తనకు చాలా ఎక్సయిటింగ్ గా ఉందని’ ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే తాను పెళ్లి చేసుకునేది ఎవరినో మాత్రం ఆమె వెల్లడించలేదు.