బుల్లితెర యాంక‌ర్.. క‌ట్నం ఎంతో తెలిస్తే షాకే!

Monday, October 16th, 2017, 05:14:23 PM IST

బుల్లితెర యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. హైటును మించిన వెయిటున్న యాంక‌రుగా ప్ర‌దీప్ వెలిగిపోతున్నాడు. త‌న‌దైన వాక్చ‌తుర‌త‌తో న‌వ‌త‌రంలో అద్భుత‌మైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మాచిరాజు.. .చాలా త‌క్కువ టైమ్‌లోనే టాప్ యాంక‌ర్‌గా టాప్ రేంజ్ పారితోషికం అందుకుంటున్నాడు.

అయితే ప్ర‌దీప్ స్టిల్ బ్యాచిల‌ర్‌. అత‌గాడికి అమ్మాయిల్లో భీభ‌త్స‌మైన ఫాలోయింగ్ ఉంది. అతడు .. ఊ అనాలే కానీ క‌న్నెలంతా పెళ్లాడేసేందుకు సిద్ధ‌మే. అందుకే ఇంట్లోవాళ్లు తొంద‌ర‌ప‌డి సంబంధాలు వెతుకుతున్నారుట‌. ఇటీవ‌లే ఓ సంబంధం చూశారుట‌. విశాఖకు చెందిన ఓ టాప్‌ రియల్ ఎస్టేట్ బిజినెస్‌మేన్ కుమార్తెను ప్ర‌దీప్‌కి ఇచ్చి చేసేందుకు అట్నుంచి ప్ర‌పోజ‌ల్ వ‌చ్చిందిట‌. 5 కోట్ల కట్నం, సిటీలో ఖరీదైన ఏరియాలో రెండు ఫ్లాట్లు ఇచ్చి ఘనంగా ఈ వివాహం జరిపించేందుకు వ‌ధువు తండ్రి ప్ర‌పోజ‌ల్ పెట్టారుట‌. ప్ర‌దీప్ త‌ల్లిదండ్రుల‌తో మాటా మంతి సాగింద‌ని తెలుస్తోంది. అంతేకాదు స‌ద‌రు బిజినెస్ మ్యాగ్నెట్ కుమార్తె అమెరికాలో ఎంఎస్ చ‌దువుతోంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సంబంధాన్ని ప్ర‌దీప్ ఓకే చేయ‌లేద‌ని తెలుస్తోంది. త‌న పెళ్లి గురించి తానే జోకులేసుకుంటూ స‌ర‌దాగా ఉండే ప్ర‌దీప్ ఇలా ఎందుకు తిర‌స్క‌రిస్తున్న‌ట్టు?