భ‌లే కౌంట‌ర్ ఇచ్చిన యాంక‌ర్ ర‌ష్మీ.. ఇంత‌కీ ఎవ‌రికంటే..?

Friday, October 19th, 2018, 02:07:11 AM IST

తెలుగు బుల్లితెర పై దూసుకుపోతున్న హాట్ యాంక‌ర్ ర‌ష్మీ.. వెండితెర పై కూడా అప్పుడ‌ప్పుడు మెరుస్తోంది. ఇక గుంటూరు టాకిస్‌లో రెచ్చిపోయిన ర‌ష్మీ ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల్లో న‌టించినా పెద్ద‌గా ఒక్క హిట్ కూడా అమ్మ‌డి ఖాతాలో ప‌డ‌లేదు. అయితే బుల్లితెర పై మాత్రం ర‌ష్మీకి మంచి డిమాండ్ ఉంది. అయితే ఇక్క‌డ అసలు మ్యాట‌ర్ ఏంటంటే ర‌ష్మీ ఏదైనా స్ట్ర‌యిట్ గానే మాట్లాడుతుంది.. తేడాగా ఎవ‌రైన ప్ర‌వ‌ర్తిస్తే రాష్‌గానే స‌మాధానం చెబుతోంది.

అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో ర‌ష్మీ బాడీ పై ఒక నెటిజ‌న్ కామెంట్స్ చేశాడు. యాంక‌ర్ ర‌ష్మీ లావుగా త‌యారైంద‌ని.. ఏదో ఎత్తుకొని చూసిన‌ట్టు బ‌రువు బాగా పెరిగింద‌ని సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. దీంతో వెంట‌నే స్పందించిన ర‌ష్మీ.. సినిమా సినిమాకి గ్యాప్ తీసుకొని వ‌ర్క‌వుట్లు చేసి బాడీని షేపులోకి తెచ్చుకోవ‌డానికి.. తానేమి హీరోయిన్‌ని కాన‌ని ర‌ష్మీ పైర్ అయ్యింది. ఇక తాను ఒక హోస్టున‌ని దీంతో ప్ర‌తిరోజు షూటింగ్ ఉంటుంద‌ని.. అందువ‌ల్ల ప్ర‌తిరోజు జిమ్‌కి వెళ్ళి వ‌ర్క‌వుట్లు చేయ‌లేనని.. అయినా నేను బ‌రువు పెరిగితే నీకేంటి ప్రాబ్ల‌మ్ అంటూ గట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది ర‌ష్మీ.

  •  
  •  
  •  
  •  

Comments