యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు నమోదు..!

Tuesday, April 27th, 2021, 05:45:10 PM IST

టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదయ్యింది. తన వద్ద విడతల వారిగా కోటి రూపాయల వరకు డబ్బును బుల్లితెర నటుడు, యాంకర్‌ శ్యామల భర్త నర్సింహారెడ్డి అప్పుగా తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే 2017 నుంచి 2021 వరకు విడతల వారిగా తీసుకున్న తన డబ్బును చెల్లించాలని అడుగుతుంటే నర్సింహా రెడ్డిని అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాదు తనపై నర్సింహారెడ్డి లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపైనే సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నర్సింహారెడ్డితోపాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.