డ్రాగన్ లా పొగలు కక్కిన యాంకర్ సుమ!

Thursday, June 7th, 2018, 12:20:26 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. గత కొన్నేళ్లుగా టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఎంత సరదాగా ఉంటారో అందరికి తెలిసిందే. మాటలతో మాయ చేయడమే కాకుండా అప్పుడపుడు కొన్ని చీలిపి చేష్టలతో అభిమానులను ఆకట్టుకుంటారు. రీసెంట్ గా సుమకు సంబందించిన ఒక వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ఒక చోట ఐస్ క్రీమ్ తింటూ వెరైటీగా చేసిన ప్రయత్నం అందరిని ఆకట్టుకుంటోంది.

ఎంతో కూల్ గా ఉండే ఆ ఐస్ క్రీమ్ తింటే ఒక సరదా. నోట్లోంచి, ముక్కులోంచి పొగలు వస్తుంటే కొత్తగా అనిపిస్తుందట. దాన్ని సుమ ట్రై చేస్తూ ఓ డ్రాగన్‌ వదిలే శ్వాసలా.. పొగ వచ్చేస్తోందని పేర్కొని తన ఫెస్ బుక్ లో పోస్ట్ చేయగా అభిమానులు దాన్ని సరదాగా షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్న వారిలో సుమ టాప్ లో ఉన్నారని చెప్పాలి. సోషల్ మీడియాలో ఆమెకు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments