రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం ఆ ఒక్కటి క్లియర్ చేయగలదా?

Wednesday, January 15th, 2020, 12:00:04 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై హైకోర్టు లో పలు ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం వున్నట్లుగా కనిపిస్తుంది. మూడు రాజధానుల నిర్ణయం అమలుకు పలు న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం వుంది. ఇప్పటివరకు అమరావతి రాజధాని కోసం రైతుల భూములు మాత్రమే కాకుండా పలు సంస్థలతో ప్రభుత్వం అగ్రీమెంట్లని కూడా కుదుర్చుకుంది. అయితే ఈ విషయంలో జగన్ ముందు జాగ్రత్తగా అలోచించి పలు సంస్థలతో కాంట్రాక్టు రద్దు కూడా చేయించుకున్నారు.

అయితే రాజధాని ఫై అసెంబ్లీలో జగన్ నిర్ణయం తీసుకొనే సమయం దగ్గర పడుతుండటంతో పలు రకాలుగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఫై హైకోర్టు లో ఫిర్యాదులు వెల్లువెత్తనున్నాయని అర్ధం అవుతుంది. విపక్షాలు మాత్రమే కాకుండా తాజాగా సుజనా చౌదరి సైతం న్యాయ పరమైన చిక్కులు వస్తాయని చాల స్పష్టంగా తెలియజేసారు. ఈ విషయం లో జగన్ కాన్ఫిడెంట్ గా ఉంటే మూడు రాజధానుల నిర్ణయం అమలు అయ్యే ఛాన్స్ వుంది. మరి ముఖ్యమంత్రి జగన్ ఈ సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కుంటారో లేదో చూడాలి.