చంద్రబాబుకు అద్దిరిపోయే ప్రశ్న విసిరిన ఏపీ మంత్రి

Tuesday, January 14th, 2020, 01:00:48 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీ కి ఎంతోకాలం నమ్మకంగా వున్న ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు స్వార్ధ ప్రయోజనాల కోసమే విశాఖకు పాలనా రాజధాని రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిని పూర్తిగా తరలించడం లేదని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనీ జగన్ బావిస్తున్నారని తెలిపారు. మంత్రి అవంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా టీడీపీ నేతల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

విశాఖ జిల్లాల్లో ప్రజలు టీడీపీ కి నలుగురు ఎమ్మెల్యే లని ఇచ్చారని గుర్తు చేసారు. అయితే వారికీ చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ విషయంలో విశాఖవాసులకు చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు తీరుని ఎండగట్టిన మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తూ, రాజధాని ప్రాంత రైతులకు జగన్ తప్పక న్యాయం చేస్తారని అన్నారు.