వీడియో : ఉమ్మడి ఏపీ..కొరటాల, మహేష్ టార్గెట్..!

Thursday, January 25th, 2018, 10:47:51 PM IST

రెండు వరుస పరాజయాలతో దెబ్బ తిన్న పులిలా ఉన్నాడు మహేష్. ఈ సరి బాక్స్ ఆఫీస్ ని గట్టిగా కొట్టేందుకు పొలిటికల్ డ్రామాతో వేసవిలో మన ముందుకు రాబోతున్నాడు. కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను అనేది వర్కింగ్ టైటిల్. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు రేపు ఫాన్స్ ని ఖుషి చేయడానికి సిద్ధం అయిపోయాడు.

ఫస్ట్ ఓత్(తొలి ప్రమాణం) పేరుతో రేపు ఓ ఆడియోని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొరటాల సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. ఈ పొలిటికల్ డ్రామా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు కొరటాల కంఫర్మ్ చేశాడు. ఈ తరహా చిత్రంలో మహేష్ బాబు నటించడం ఇదే తొలిసారి. ఆల్రెడీ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. దీనితో అభిమానుల్లో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.