కరోనా వైరస్ వైద్య పరీక్షలలో ఏపి రికార్డ్!

Sunday, May 24th, 2020, 11:04:08 PM IST


భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ నేపధ్యంలో కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ మేరకు ఒక రికార్డ్ నెలకొల్పింది.వైద్య పరీక్షల్లో ఇప్పటివరకు 3 లక్షలకు పైగా నిర్వహించింది.అయితే గడిచిన 24 గంటల్లో 11 వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించింది. అయితే ఇప్పటివరకు దీని సంఖ్య 3 లక్షల 4 వేల 326 కి చేరింది.

అయితే కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఎంత వీలైతే అన్ని కరోనా పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉంది.అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ 4 అమలు లో ఉంది. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా లాక్ డౌన్ అమలు పై సడలింపు చర్యలు తీసుకుంటుంది. అయితే కేసులు నమోదు అవుతున్నప్పటకి రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయగలం అనే నమ్మకం ప్రజలలో కలుగుతోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీని వలన ప్రజలు ఆందోళన చెందే అవకాశం లేకుండా పోయింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలి. స్వీయ నియంత్రణ కూడా తప్పని సరిగా పాటించాలి. భౌతిక దూరం పాటించాలి. అయితే కరోనా పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలైన అన్ని చర్యలు తీసుకుంతుంది.