మానవత్వాన్ని చాటుకున్న ఏపీ మంత్రి – రోడ్డుప్రమాద బాధితులకు సాయం…

Friday, May 22nd, 2020, 02:05:01 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా ఇటీవల జరిగినటువంటి రోడ్డుప్రమాద బాధితులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన వంతుగా భారీ సాయాన్ని అందించారు. కాగా మహమ్మారి కరోనా కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వలస కూలీలను తీసుకెళ్లేందుకు తమిళనాడు నుంచి వస్తున్న బస్సు గుంటూరు రూరల్‌ మండలం ఓబులునాయుడు పాలెం వద్ద ఎన్‌హెచ్‌ 16పై రోడ్డుపక్కన మొక్కలకు నీరు పోస్తున్న ట్రాక్టర్‌ ట్యాంకర్‌ను చాలా బలంగా ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన బస్సు డ్రైవర్‌ రాజా తీవ్ర గాయాలతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. క్లీనర్‌ బాబు బస్సులో నుంచి దూకి కిందపడ్డాడు.

కాగా ఆ సమయంలో విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఈ ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్ ని అక్కడే ఆపించారు. కాగా తన కాన్వాయ్ లో ఉన్నటువంటి సొంత సిబ్బంది మరిత్యు స్థానికుల సాయంతో ఆ ప్రమాదంలో బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ ని బయటకు తీశారు. అంతేకాకుండా ఈ విషయాన్నీ స్థానిక పోలీసులకు, గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. అంతేకాకుండా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా డాక్టర్‌ కావటంతో, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి సంఘటన స్థలంలో ఇరువురికీ ప్రథమ చికిత్స చేశారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించగా, క్లీనర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.