షాక్ … ఆ హీరోయిన్ చైన్ స్మోకరంట!!

Sunday, November 27th, 2016, 11:06:47 AM IST

anjalina
హాట్ హాట్ గా ప్రేక్షకులను కట్టి పడేసే ఆ హీరోయిన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్. ఆమె అందానికి ఫిదా కానీ ప్రేక్షకుడు ఎవరు ఉండరు. అలాంటి గ్లామర్ భామ చైన్ స్మోకర్ అని తెలిసి ఫాన్స్ షాక్ అవుతున్నారు? ఇంతకీ ఎవరా హీరోయిన్ ? అనుకుంటున్నారా .. ఆమె ఎవరో కాదు హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ. బ్రాడ్ ఫిట్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈమె లేటెస్ట్ గా ఆయనతో విడిపోవడానికి సిద్ధం అయింది. ఇంకా అఫీషియల్ గా డైవోర్స్ రాలేదు కానీ ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు. మరో వైపు బ్రాడ్ పిట్ కూడా మరో హీరోయిన్ తో అప్పుడు కథలు మొదలు పెట్టాడట, ఇక ఈ టెన్షన్ తట్టుకోలేని ఏంజిలినా దమ్ము మీద దమ్ము కొడుతూ వరుసగా సిగరెట్ లు తాగుతుందట, ఇప్పటికే ఏంజిలినా కాన్సర్ కారణంగా తన పై అందాలు కోల్పోయింది. మరి ఇలాగె సిగరెట్స్ తాగితే ఆమె ఆరోగ్యం ఎం కాను అంటూ టెన్షన్ పడుతున్నారు దగ్గరివాళ్ళు.