యాంజెలినా నిత్య‌య‌వ్వ‌న ర‌హ‌స్యం లీక్‌!

Friday, May 4th, 2018, 04:30:53 PM IST

హాలీవుడ్ మేటి క‌థానాయిక యాంజెలినా జోలీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. గ‌త కొంత‌కాలంగా ఈ ఫ్యాన్స్‌లో యాంజెలీనా ఒంట‌రిత‌నం గురించిన‌ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. భ‌ర్త బ్రాడ్‌ఫిట్ నుంచి విడిపోయిన యాంజెలినా ఒంట‌రిత‌నాన్ని స‌హించ‌లేక పిచ్చెక్కిపోతోంద‌ని ప్ర‌చారం సాగింది. అదంతా అటుంచితే.. జోలీకి సంబంధించిన వేరొక టాప్ సీక్రెట్ లీకైంది. అది లీక్ చేసింది త‌న ప‌ర్స‌న‌ల్ డాక్ట‌ర్‌. అస‌లింత‌కీ ఏమా సీక్రెట్? అంటే..

స‌హ‌జంగానే క‌థానాయిక‌లకు గ్లామ‌ర్ ఎంతో ఇంపార్టెంట్. అది కాపాడుకున్నంతవ‌ర‌కే మార్కెట్ ఉంటుంది. వ‌రుస‌గా సినిమాల్లో న‌టించినా, లేదూ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించాల‌న్నా అవ‌కాశాలు ఉంటాయి. ఒక‌వేళ అందం ఏమాత్రం మిస్స‌యినా ఇక అంతే సంగ‌తి. అందుకే అంద‌రు సీనియ‌ర్ క‌థానాయిక‌ల్లానే యాంజెలీనా కూడా త‌న అందం కాపాడుకునేందుకు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునేది. ఖ‌రీదైన‌ హైడ్రాక్సిల్స్‌, యాంటీఆక్సిడెంట్స్ వంటి మెడిసిన్‌ని తీసుకుంటుంది. ఇవి ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖ‌వ‌ర్చ‌స్సు నిత్య‌య‌వ్వ‌నంతో తుల‌తూగుతుంది. వాటిని నిరంత‌రం త‌న సౌంద‌ర్యాన్ని కాపాడుకునేందుకు యాంజెలినా ఉప‌యోగిస్తోంది. దేహ‌శిరుల్లో్ న‌వ‌య‌వ్వ‌న కాంతితో తేజోవంతంగా క‌నిపించేందుకు డెర్మ‌టాల‌జిస్ట్ సూచించిన మెడిసిన్ ఉప‌యోగిస్తోంది. తాజాగా త‌న వ‌య‌సును స‌గానికి స‌గం త‌గ్గించే అత్యంత ఖ‌రీదైన, ప్ర‌భావ‌వంత‌మైన‌ `రిఫైన‌రీ 29` అనే మందును యాంజెలీనా కోసం స‌ద‌రు డాక్ట‌ర్ గారు తెచ్చి ఇచ్చారుట‌. ఈ ర‌హ‌స్యాల‌న్నీ ఆయ‌నే స్వ‌యంగా లీక్ చేసేశారు.