అంబానీ టూ అదానీ..వారసులకు కళ్లుచెదిరే జీతాలు..!

Monday, September 26th, 2016, 05:46:04 PM IST

ambani
వ్యాపారరంగంలో అంబానీ నుంచి అదానీ వరకు దేశం లోనే కోటీశ్వరులుగా ఎదిగిన వారు ఉన్నారు.వారి ఆస్తి వారి కుటుంబంలో కొన్ని తారలు తిన్నా తరగదు.కానీ అంబానీ, అదానీ వంటి వారు వారి వారసులను తమ సంస్థల్లోకి తీసుకునివచ్చి కళ్లుచెదిరే వేతనాలు ఇప్పిస్తున్నారు. చాలా మంది వారి కుమారులను, కుమార్తెలను వారి వారసులుగా తీసుకుని వచ్చి వారికి కీలక బాధ్యతలు అప్పగించడంద్వారా కోట్లల్లో వేతనాలు ఇప్పిస్తున్నారు. దీనితో వచ్చి రాగానే వారి కుమారులు కరోడ్పతులుగా మారిపోతున్నారు.

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుమారుడు కరణ్.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ సీఈఓ గా నియమితులయ్యారు.అయితే ఈయన 2015-16 లో ఎలాంటి వేతనాన్ని అందుకోలేదు. ఈ సెప్టెంబర్ నుంచి కరణ్ కు రూ 1.5 కోట్లు ప్యాకేజ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అనిల్ అంబానీ కుమారుడు జై అనుమోల్ అంబానీకి ఇటీవలే గ్రూప్ కంపెనీల రిలయన్స్ కాపిటల్ లో డైరెక్టర్ గా చేరిపోయాడు.ఇతనికి నెలకు 10 లక్షలు వేతనాన్ని చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. అంటే సంవత్సరానికి రూ 1.2 కోట్లు. ఇక ఇతర బడా వ్యాపారవేత్తల వారసులు కూడా కొట్లల్లోనే వేతనాలు తీసుకుంటూ ఆయా కంపెనీలలో కీలక భాద్యతలు నిర్వహిస్తున్నారు. టివీఎస్ మోటార్స్ ఎండి వేణు శ్రీనివాసన్ కుమారుడు సుదర్శన్ వేణు జాయింట్ ఎండీ గా గత ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 10 కోట్ల వేతనాన్ని అందుకున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments