చంద్రబాబు ప్రభుత్వం లో నాపై అక్రమం గా కేసులు పెట్టారు – అనిల్ కుమార్ యాదవ్!

Tuesday, July 7th, 2020, 02:59:22 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ, టీడీపీ ల మధ్య రాజకీయ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వరుస టీడీపీ నేతల అరెస్టుల వ్యవహారం తో ఒక పక్క టీడీపీ ఆగ్రహ జ్వాలలు రేపుతూ విమర్శలు చేస్తుండగా, వైసీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టీడీపీ నేతల తీరును ఎండగడుతూ గట్టిగా జవాబు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ను స్పష్టమైన ఆధరాల తోనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొల్లు రవీంద్ర నిజంగా తప్పు చేయకపోతే పోలీసులను చూసి ఎందుకు గోడ దూకి పారిపోయారు అని సూటిగా ప్రశ్నించారు. బీసీ నేతల్ని అరెస్ట చేస్తున్నారు అని చంద్రబాబు అంటున్నారు అని, తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పా అని అనిల్ కుమార్ యాదవ్ నిలదీశారు. అయితే అయ్యన్న పాత్రుడు మాటలు చూస్తుంటే కౌరవుల సభ గుర్తొస్తుంది అని అన్నారు. మహిళ అధికారి పై అయ్యన్న చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు సమర్దిస్తాడా అని నిలదీస్తూ ప్రశ్నించారు. అంతేకాక అచ్చెన్న వ్యవహారం పై కూడా అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు ను ప్రశ్నించారు.

150 కోట్ల రూపాయలను దోచిన అచ్చెన్న ను అరెస్ట చేస్తే బీసీ కులం వాడతారా, తప్పు చేసి అడ్డంగా దొరికితే ఇలా కులం పేరు చెప్పడం టీడీపీ కు మామూలు అయిపోయింది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం లో తన పై అక్రమం గా కేసులు పెట్టారు అని, అందులో ఒక్కటి కూడా నిరుపించలేకపోయారు అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.నేను బీసీ ఎమ్మెల్యే ను కాదా, మీరా బీసీ ల యొక్క అత్మభిమానం గురించి మాట్లాడేది అని అన్నారు. అంతేకాక చట్టం ముందు కులాలు, మతాలు ఒక్కటే అని వ్యాఖ్యానించారు.