తండ్రి, కొడుకులకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్..!

Sunday, August 11th, 2019, 10:49:39 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావని గత కొద్ది రోజులుగా చంద్రబాబు, నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఏదైనా విమర్శించేటప్పుడు ఆ విషయం నిజమా, అబద్ధమా అని తెలుసుకున్నాక ట్వీట్ చేయాలి. లేదంటే అది తిరిగి వారికే బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి తప్పే ఒకటి చేసి చంద్రబాబు వైసీపీ నేతలకు అడ్డంగా దొరికిపోయారు. అయితే ఆ విషయాన్ని పట్టుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవటంతో తండ్రికొడుకులకు మతి స్థిమితం సరిగా లేదని అందుకే ట్విట్టర్‌లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని 2015 లో తెలంగాణలో జరిగిన ఆందోళన ఫోటో తీసుకోని ఇప్పుడు ఏపీలో జరిగినట్లు ట్విట్టర్‌లో పోస్టు పెట్టారని తీరా అది తప్పుడు ఫోటో అని తెలిసే సరికి దానిని డిలీట్ చేసారని అన్నారు. అధికారం కోల్పోయేసరికి ఏమి మాట్లాడుతున్నారో కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారంటూ అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.