పవన్ కళ్యాణ్‌కి అల్టీమేట్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ మంత్రి..!

Monday, December 2nd, 2019, 08:33:22 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్‌ని విమర్శించే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదని అన్నారు. ప్రజల కోసం ప్రశ్నించేందుకు రాజకీయాలలోకి వచ్చానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ నాడు అధికారంలో ఉన్న టీడీపీనీ వదిలేసి వైసీపీపై ఆరోపణలు చేశారని దానిని చూసే ప్రజలు రెండు చోట్లా ఓడించారని ఎద్దేవా చేశారు.

అయితే సీఎం జగన్ దమ్ము, ధైర్యం ఏపీ ప్రజలకు తెలుసని అందుకే భారీ మెజారిటీతో గెలిపించి సీఎంను చేశారని అన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఫాలో అవ్వడం మానలేకపోతున్నారని అందుకే ఇద్దరు కలిసి తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని అన్నారు. సోషల్ మీడియాలో నీ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని కాస్త వారిని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి అని వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే గత టీడీపీ హయాంలో కర్నూలులో యువతి హత్య జరిగితే దానిని వైసీపీపై రుద్దాలని పవన్ ప్రయత్నిస్తున్నారని గత రెండేళ్ళూ పవన్ నిద్రపోయాడా లేక టీడీపీకి వత్తాసు పలికాడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.