అసెంబ్లీలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన డైలాగ్.. షాక్‌లో తెలుగు తముళ్ళు..!

Thursday, July 11th, 2019, 04:13:20 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

అయితే తాజాగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎంతవరకు వడ్డీలేని రుణాలు ఇచ్చారనే అంశంపై ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు హయాంలో వడ్డీ లేని రుణాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పైగా జగన్ విసిరిన సవాల్‌ను స్వీకరించడం చేత కాక చంద్రబాబు తోక ముడిచారని అన్నారు. అంతేకాదు రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారని ప్రజలకు సరైన పాలన అందించడానికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అవసరంలేదని ఇప్పుడు జగన్ దెబ్బకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ బుల్లెట్ దిగింది కాబట్టే సమాధానం చెప్పలేకపోతున్నారని అనిల్ కుమార్ మహేశ్‌బాబు స్టైయిల్‌లో డైలాగ్ చెబుతుంటే చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు సైతం షాక్‌కు గురయ్యారు.