టీడీపీ 23 ఎమ్మెల్యేలపై అనిల్ కుమార్ యాదవ్ సంచలనం.!

Thursday, July 11th, 2019, 01:30:02 PM IST

ఈ రోజు మరోసారి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.ఈసారి కూడా ఎప్పటిలానే అటు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరియు ఇటు అధికార పార్టీ వైసీపీ పార్టీల మధ్య పెద్ద ఎత్తున విమర్శలు,ప్రతి విమర్శలు వెల్లువెత్తాయి.అలాగే చంద్రబాబుకు అసహనం తెప్పించేలా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సహా జగన్ కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నారు.

ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీపై కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం అనే ప్రాజెక్టును గతంలో వైఎస్సార్ మొదలు పెడితే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే పూర్తి చేయబోతున్నారని చెప్పగా టీడీపీ ఎమ్మెల్యే అనిల్ మాటలపై అభ్యంతరం వ్యక్తం చెయ్యగా అనీల్ దిమ్మతిరిగే కౌంటర్ వేశారు.ముందు మీకున్న 23 మంది ఎమ్మెల్యేలు ఎటూ పోకుండా కాపాడుకోండి అని 2024 వరకు వారంతా ఉంటారా అన్నట్టుగా సంచలన కామెంట్స్ చేసారు.