చంద్రబాబుపై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ సంచలన ఆరోపణలు..!

Friday, August 23rd, 2019, 11:15:14 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఏపీలో ఎన్నికలు అయిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్నా కూడా ఏపీ రాజకీయాలలో వేడి తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక పార్టీ నేత మరొక పార్టీ నేత ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

అయితే తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసారు. చంద్రబాబు వరద గురుంచి మాట్లాడకుండా తన ఇంటిని వైసీపీ కావాలని ముంచిందని, చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా నిండలేదని రాయలసీమకు శ్రీశైలం నీళ్లు తరలించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, కృష్ణా డెల్టా రైతులకు ప్రకాశం బ్యారేజి నుంచి నీళ్లు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని అన్నారు. చంద్రబాబు అండ చూసుకునే కోడెల అసెంబ్లీలోని ఫర్నిచర్ దోచుకున్నరని, కోడెల మాదిరే చంద్రబాబు కూడా ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నారని అన్నారు. అయితే ప్రజలు ఓడించిన చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని, ఇక మీదట అయినా కాస్త బుద్ధిగా ఉండడం నేర్చుకోవాలని అన్నారు.