మళ్ళీ అడ్డంగా బుక్కైన అనీల్ కుమార్ యాదవ్.!

Saturday, August 24th, 2019, 03:36:51 PM IST

ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో ఉన్నటువంటి కొంత మంది కీలక నేతల్లో కనిపించే వారిలో నెల్లూరు ఎమ్మెల్యే మరియు నీటి పారుదల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా ఖచ్చితంగా ఉంటారు.ఈయన మైక్ పట్టుకుంటే ప్రత్యర్ధ పార్టీలకు ఏస్థాయిలో చెమటలు పట్టిస్తారో అందరికి తెలుసు.ఆయన గొంతు అలాంటిది మరి.తాను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి వైసీపీ కోసం మరియు ఆ పార్టీ అధినేత జగన్ కోసం ఇచ్చే స్పీచులతో వైసీపీ అభిమానులతో చప్పట్లు కొట్టించేవారు.

కానీ ఇప్పుడు మాత్రం ఆయన తెలివి తక్కువ తనంతో సోషల్ మీడియా ప్రజానీకం చేత ట్రోల్ అవుతున్నారు.మొన్నీమధ్యనే ఎనిమిది ఇంటూ నాలుగు కి పన్నెండు అంటూ దొరికిపోగా ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి లెక్కనే చెప్పి అడ్డంగా దొరికిపోయారు.నాలుగో తారీఖు నుంచి పదహారవ తారీఖు అంటే మధ్యలో పది రోజులకు ఎక్కువ గ్యాప్ ఉన్నట్టే కానీ దాన్ని నాలుగైదు రోజులకే కుదించేసి మళ్ళీ ఒక్కో రోజుకి 15 టీఎంసీ ల నీరు అని చెప్పి మొత్తం 78 టీఎంసీ లు అంటారు.అసలు ఇదేం లెక్క?ఏపీకి కొత్త లెక్కల మాస్టారు వచ్చారు అంటూ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.మరికొంత మంది అయితే లోకేష్ కు అనీల్ గట్టి పోటీ ఇస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు.