గీత ఆర్ట్స్ నుంచి టాలెంట్ దర్శకుడికి లక్కీ ఛాన్స్ ?

Friday, October 27th, 2017, 01:25:27 AM IST

ఇటీవల రాజా ది గ్రేట్ సినిమాను తెరకెక్కించి మంచి హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావి పూడి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇంతకుముందే పటాస్ – సుప్రీమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు రవి తేజతో హ్యాట్రిక్ కొట్టడంతో అందరి చూపు ఇప్పుడు అతని వైపే మళ్లింది. దీంతో స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమా చేయడానికి చాలా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే గీత ఆర్ట్స్ కూడా ఈ దర్శకుడికి ఒక అఫర్ ఇచ్చినట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా అల్లు అర్జున్ రాజా ది గ్రేట్ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి మరి అనిల్ ని ప్రశంసించారట. ముందే గీతా ఆర్ట్స్ సంస్థ అల్లు అర్జున్ కి ఒక కథను రెడీ చేయమని కోరినట్లు తెలుస్తోంది. మరి ఎంతవరకు ఇది నిజమో తెలియదు గాని అనిల్ కు మాత్రం ఇప్పుడు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కథలను రెడీ చేసుకున్నట్లు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అతను త్వరలో ఎన్టీఆర్ తో ఒక సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పాడు. ఇక ప్రస్తుతం బన్నీ నా పేరు సూర్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిజమా తర్వాత లింగు స్వామితో ఒక సినిమాను చేయనున్నాడు. మరి అనిల్ తో సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments