ఎయిర్ పోర్టులో ‘రాజా ది గ్రేట్’.. దర్శకుడి ఆవేదన..!

Sunday, October 22nd, 2017, 02:03:46 PM IST

పైరసీ అనేది చిత్ర పరిశ్రమకు పెద్ద శాపంగా మారింది. దీనిని నివారించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆగడం లేదు. సినిమా విడుదలైన రోజే పైరసీ చేసి నెట్ లో పెట్టేస్తున్నారు. ఇలాంటి చర్యలు చిత్ర వసూళ్లపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. కాగా రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్ర పైరసీ పై దర్శకుడు అనిల్ రావిపూడి ఆవేదన వ్యక్తం చేసారు.

ఓ వ్యక్తి శంషాబాద్ ఎయిర్ పోర్టులో కూర్చుని తన ల్యాప్ టాప్ లో రాజా ది గ్రేట్ చిత్ర పైరసీని చూస్తుండగా ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ పైరసీని ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్ పెట్టాడు. దీనిని అనిల్ రావిపూడి షేర్ చేశారు. రాజా ది గ్రేట్ చిత్రాన్ని పైరసీ చేసి ఫేస్ బుక్ వంటి సామజిక మాధ్యమాల్లో సైతం షేర్ చేస్తున్నారని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంతా థియేటర్ లలోనే చిత్రాన్ని చూడాలని కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments