తారక్ తో సినిమా తప్పకుండా ఉంటుంది..

Tuesday, October 17th, 2017, 06:11:59 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నాడు. చేసింది రెండు సినిమాలే అయినా ఈ మధ్య అతని పేరు బాగా వినిపిస్తోంది.ఆ అందుకు కారణం రాజా ది గ్రేట్ లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించడమే అని తెలుస్తోంది. రెంగ్యులర్ సినిమాలకు బిన్నంగా రవితేజ ని సినిమాలో కళ్లు లేని వాడిగా చూపిస్తున్న అనిల్ సినిమాని చాలా గొప్పగా తెరకెక్కించినట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పింది.

అయితే ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ దర్శకుడు చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ ఒక మంచి విషయాన్ని చెప్పాడు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు చెప్పేశాడు. ఇప్పటికే కాన్సెప్ట్ గురించి చెప్పను. ఆయన చాలా పాజిటివ్ రియాక్ట్ అయ్యారు. త్వరలో పూర్తి కథతో మళ్లీ ఎన్టీఆర్ దగ్గరికి వెళతానని చెబుతూ..ఎన్టీఆర్ తో తప్పకుండా ఒక సినిమా ఇఉంటుందని అనిల్ తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments