బంపర్ ఆఫర్ కొట్టిన అనిరుధ్!

Thursday, May 31st, 2018, 01:09:49 AM IST


గత కొద్దిరోజులుగా కమల్ హాసన్, శంకర్ ల భారతీయుడు-2 విషయమై కోలీవుడ్ లో ఒక చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రోబో-2 తో బిజీ గా వున్న శంకర్ అది పూర్తి అవగానే కమల్ చిత్రం మొదలెట్టనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల అఫీషియల్ గా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి తొలుత సంచలన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ని తీసుకుందామని అనుకున్నారట. అయితే తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ చిత్రానికి పనిచేయలేకపోతున్నారని, అందువల్ల మరొక మ్యూజిక్ డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డారట నిర్మాత మరియు దర్శకుడు.

అయితే ఎట్టకేలకు వారు అనిరుధ్ ను ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయమై టీం అనిరుధ్ ను సంప్రదించిందట, త్వరలో ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా తీసుకోనున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే ఇందులో ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే అనిరుధ్ ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్, రజినీకాంత్ ల చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఒకవేళ ప్రస్తుతం వార్తలు వస్తున్నట్లు భారతీయుడు-2 కు కూడా తానే సంగీతం అందించినట్లైతే ఒకే సారి ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్ లతో పనిచేసే బంపర్ ఆఫర్ అనిరుధ్ కొట్టేసినట్లే మరి. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ విషయం ఎంతవరకు నిజమో త్లెయ్యాలంటే అధికారిక ప్రకటన వెలువడేవరకు ఆగాల్సిందే…..

  •  
  •  
  •  
  •  

Comments